ఉత్పత్తులు
 1. అనువాద ప్లాట్ఫారం
 2. వర్డ్ లెవల్ స్పెల్ చెక్కర్
 3. లిప్యంతరీకరణ పథకం
 4. టైపింగ్ పాడ్
 5. అధికారిక ఫాంట్ కన్వర్టర్
 6. ఈబిఎస్ వెబ్ పేజ్ లిప్యంతరీకరణం

అనువాద ప్లాట్ఫారం

అనువాద ప్లాట్ఫారంలో అనువాద ఇంజిన్ మరియు అనువాద బెంచిమార్కులు ఉన్నాయి. .


ఈ అనువాద ఇంజిన్ - భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన టీడీఐఎల్ ద్వారా నిధులు పొందిన ఐఐఐటీ హైదరాబాద్ నేతృత్వంలో భారతదేశ 13 ప్రముఖ విద్యాసంస్థల ఒక కన్సార్షియం ద్వారా ద్విదాశాత్మక ఇండియన్ లాంగ్వేజ్ మెషీన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ పైన చేసిన 20 సంవత్సరాల పరిశోధనల ఫలితం.


ట్రాన్స్లేషన్ వర్కబెంచి ఎడిటర్ కి భాషాశాస్త్ర సాధనాలు మరియు వర్డ్ ప్రాసెసింగ్ ఎన్విరాన్మెంట్ ను అందజేస్తుంది. ఈ సాధానాల సహాయంతో అనువాద పాఠాన్ని వేగంగా మార్పులు చేర్పులు చేయొచ్చు. అనువాద ప్రక్రియను మొత్తం మెరుగుపరిచి ఆటంకరహిత అనువాద సంబంధిత సేవలకోసం ట్రాన్స్లేషన్ ప్లాట్ఫారంని క్లయింట్ (కస్టమర్) కు చెందిన కంప్యూటర్ తో జతపరిచే సదుపాయం కూడా గలదు.


ఇ-భాష అనువాద ప్లాట్ఫారం: ప్రత్యేకతలు


 • • ఈ అనువాద నిర్వాహక వ్యవస్థ అనువాద ప్రక్రియ మొత్తాన్ని తేలికగా మరియు మెరుగ్గా తీర్చిదిద్దగలదు.
 • • ఈ ప్లాట్ఫారం ద్వారా క్లయింట్ కంప్యూటర్ ను జతపరిచి అనువాదాపాఠాన్ని నేరుగా క్లయింట్ కి అందజేయవచ్చు.
 • • ఈ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫారం మానవ అనువాదంతో పోలిస్తే దారాళత మరియు ఖచ్చితత్వంతో ముద్రించదగిన నాణ్యమైన రచనా సామగ్రిని అందజేస్తుంది.
 • • నేటి పెరుగుతున్న అనువాదం అవసరాలకు ఈ ప్లాట్ఫారం ఉత్తమ అనువాదాలు అందజేస్తుంది, అది కూడా చాలా తక్కువ ధరలకే.
 • • అది కూడా ముందుగా నిర్ణయించిన గడువు లోపలే.

మా అనువాద ప్లాట్ఫారమ్ (ట్రాన్స్సాజర్) గురించి మరింత తెలుసుకోవడానికి, ఇక్కడ మా అనువాద ప్లాట్ ట్యుటోరియల్ని చూడండి

వర్డ్ లెవల్ స్పెల్ చెక్కర్

పదాలలో ఉన్న తప్పులను సవరించడానికి మా ఇ-భాషా సేతు సృష్టించిన 'వర్డ్ లెవల్ స్పెల్ చెక్కర్' ఇక అద్భుత సాధనం. ఇది పదాలలో తప్పులు సవరించేటప్పుడు ఇ-భాషా సేతు వద్ద ఉన్న నిఘంటువు నుంచి తత్సమాన పదాలను ఎంచుకోడానికి కొన్ని పదాలను సూచిస్తూ ఉంటుంది.

ప్రస్తుతం ఆంగ్లం, హిందీ, పంజాబి, ఉర్దూ, తెలుగు, తమిళం మరియు కన్నడ భాషలలో మా 'వర్డ్ లెవల్ స్పెల్ చెక్కర్' అందుబాటులో ఉంది.

లిప్యంతరీకరణ పథకం

ఒక అపరిచిత భాషను చదవడం అంత సులభమైన పని కాదు. కానీ నేడు మా లిప్యంతరీకరణ పథకం ద్వారా అది సాధ్యమే. మీరు మీ భాషలో మీకు తెలియని ఆ ఇతర భాషను చదవుకోవడానికి మా ఈ లిప్యంతరీకరణ పథకం తోడ్పడుతుంది. ప్రస్తుతం ఈ పథకం కింద పేర్కొనబడిన భాషలకు అందుబాటులో ఉంది.


హిందీ(దెవనాగరి లిపి) నుంచి ఆంగ్లానికి(రోమన్ లిపి)

హిందీ(దెవనాగరి లిపి) నుంచి ఉర్దూకు(నస్తలిక్)

టైపింగ్ ప్యాడ్

మీకు తెలియని భాషలో టైపింగ్ చేయడం అనేది కొంచెం కష్టమైన పనే. అయితే మేము రూపొందించిన 'బహుభాషా కీబోర్డ్' ద్వారా మీరు మీ మీ భాషలలో తేలికగా టైప్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, ఉర్దూ, తెలుగు, తమిళ్, కన్నడ భాషలకు బహుభాషా కీబోర్డ్ అందుబాటులో ఉంది.

టైపింగ్ ప్యాడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక ఫాంట్ కన్వర్టర్

ఒక పాఠంలో ఎలాంటి ఫాంట్స్ ని ఉపయోగించారు అనేది పాఠకులకు చాలా ఆసక్తి కలిగించే విషయం. అందుకే మీరు ఏదైనా టైప్ చేసేటప్పుడు వాడే ఫాంట్ చాలా స్పష్టంగా మరియు పాఠకులను ఆకర్షించేదిగా ఉండాలి. ఇలాంటి పరిస్థితులలో మా అధికారిక ఫాంట్ కన్వర్టర్(ఫాంట్ <-> యూనికోడ్) మీకు సహాయపడుతుంది. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, ఉర్దూ, తెలుగు, తమిళ మరియు కన్నడ భాషలలో ఈ ఫాంట్ కన్వర్టర్ అందుబాటులో ఉంది.

ఈబిఎస్ వెబ్ పేజ్ లిప్యంతరీకరణం

వెబ్ పేజ్ లిప్యంతరీకరణం   మరియు   ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ వెబ్ పేజ్ స్థానికీకరణి.

1. పై లింక్ ను క్లిక్ చేయండంతో ఫైర్ఫాక్స్ కు మా ప్లగిన్ డౌన్లోడ్ అవుతుంది.

2. ఈ ప్లగిన్ ను ఇన్స్టాల్ చేసుకోవడానికి (Menu> Add-ons> Tools> Install Add-on) ఎంచుకోండి. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో పైల్ ఆప్షన్ నుంచి Add-on ని ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడు మీ కంప్యూటర్ లోకి డౌన్లోడ్ అయిన ".xpi" పైల్ ను కనుగొన్న తరువాత ఇన్స్టాల్ ని క్లిక్ చేయండి.

క్రోమ్ బ్రౌజర్ కి వెబ్ పేజ్ లిప్యంతరీకరణం

1. పై లింక్ ను క్లిక్ చేయండంతో క్రోమ్ కు మా ప్లగిన్ డౌన్లోడ్ అవుతుంది.

2. ఈ ప్లగిన్ను ఇన్స్టాల్ చేయడానికి "chrome: //extensions/" అన్న లింక్ ను Chrome బ్రౌజర్ లో కాపీ చేసి పేస్ట్ చేయండి.

మీ కంప్యూటర్ లో డౌన్లోడ్ అయిన '.crx *' ఫైల్ ను కనుగొని దానిని డ్రాగ్ చేసి ఎక్స్టెన్షన్ పేజీలో డ్రాప్ చేయండి. ఎక్స్టెన్షన్ ఉన్న అనుమతులను చూపిస్తూ మరియు ఇన్స్టాల్ ను ఖాయపరచాలా లేదా అని మిమ్మల్ని అడుగుతూ మీకు ఒక 'పాప్ అప్' కనిపిస్తుంది.

3. మీ కంప్యూటర్ లో డౌన్లోడ్ అయిన '.crx *' ఫైల్ ను కనుగొని దానిని డ్రాగ్ చేసి ఎక్స్టెన్షన్ పేజీలో డ్రాప్ చేయండి. ఎక్స్టెన్షన్ ఉన్న అనుమతులను చూపిస్తూ మరియు ఇన్స్టాల్ ను ఖాయపరచాలా లేదా అని మిమ్మల్ని అడుగుతూ మీకు ఒక 'పాప్ అప్' కనిపిస్తుంది.