ఇ-భాష సేతు అనే ఈ సంస్థ హైదరాబాద్ లో నెలకొన్న ఒక భాషా సాంకేతిక స్టార్టప్ కంపెనీ. మేము హిందీ, ఉర్దూ, పంజాబీ, తెలుగు, తమిళం, కన్నడ వంటి అన్ని ప్రధాన భారతీయ భాషలలో అనువాద సేవలను అందిస్తాం. "టెక్నాలజీ అసిస్టెడ్ హ్యూమన్ ట్రాన్స్లేషన్" గా పేర్కొనబడే మా ఈ అనువాద సేవలు ఉన్నత భాషా అభియంత్రిక సాంకేతికత మరియు సహజ మానవ అనువాదాల కలయిక. అందువలన మీరు ధారళమైన మరియు ఖచ్చితమైన రచనా సామగ్రిని అతి తక్కువ సమయంలో పొందగలుగుతారు.

టెక్నాలజీ అసిస్టెడ్ హ్యూమన్ ట్రాన్స్లేషన్ (సాంకేతికత సహాయంతో చేసే మానవ అనువాదం - టి ఎ ఎచ్ టీ) ఇ-భాష సేతు యొక్క 'ట్రాన్స్లేషన్ వర్క్ బెంచ్' ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రధానంగా యాంత్రిక అనువాదంపై ఆధారపడి ఉంటుంది. ఈ అనువాద సాంకేతికత యొక్క ప్రస్తుత రూపం వెనుక భారతదేశ ప్రధాన విద్యా సంస్థలు ద్వారా భాషా సాంకేతికత రంగంలో 20 సంవత్సరాల నిరంతర పరిశోధనాపరమైన కృషి ఉంది. ఈ ట్రాన్స్లేషన్ వర్క్ బెంచ్ అనువాద ప్రక్రియను సరళంగా ఏ ఆటంకంలేకుండా మెరుగ్గా చేయడానికి అనువాదకులు, భాషా నిపుణులు మరియు ప్రూఫ్ రీడర్స్ కి అనువాద సంబంధిత అన్ని సాధానాలను అందజేస్తుంది. ఈ సాధానాలు: అనువాద స్మృతులు, నిఘంటువులు, పర్యాయ పదకోశాలు, కస్టమైజేషన్ రూల్స్ / కార్పోరా, పదకోశాలు, క్షేత్రం నిర్దిష్ట వనరులు/ సాంకేతిక పదసమూహాలు మొదలగునవి.

మీ సూచనావసరాలను నెరవేర్చడానికి మా బృందంలో నైపుణ్యంగల అనువాదకులు, భాష శాస్త్రజ్ఞులు, భాష నిపుణులు మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అంతేకాక మీ అనువాద సంబంధిత అవసరాలను తీర్చడానికి స్వేచ్ఛగా పనిచేసే భాషా నిపుణులూ భాషావేత్తలూ కూడా ఉన్నారు.

మిషన్

భారతీయ భాషలకు సంబంధించి అనువాద పరిశ్రమలో ఉత్తమ అనువాద సేవలు అందించడమే "ఇ-భాష సేతు లాంగ్వేజ్ సర్వీసెస్" యొక్క ముఖ్య ద్యేయం .

విజన్

భారతీయ భాషలలో రచనా సామగ్రిని అందించడం ద్వారా సామాన్య జనానికానికి ఇంటర్నెట్ లో లభ్యమయ్యే జ్ఞాన సామగ్రిని అందించడం ఇ-భాష సేతు సంస్థ విజన్.

లక్ష్యం

భాషా సాంకేతికత ఆధారంగా ఒక అనువాద ప్లాట్ఫారంను అందించడం ఇ-భాష సేతు లక్ష్యం. దీని ద్వారా భారతీయ భాషలలో ఉన్న డిజిటల్ మరియు ఆడియో విజువల్ సమాచార సామగ్రీలను అనువాదం చేసి ఏ డిజిటల్ ప్లాట్ఫారంలో అయినా అందించవచ్చు.